urea | ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ

urea | ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ

  • మండల ప్రత్యేక అధికారి శీలం శ్రీమన్నారాయణ

urea | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు యూరియా(urea) పంపిణీ జరుగుతుందని మండల ప్రత్యేక అధికారి శీలం శ్రీమన్నారాయణ అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలోని రైతు వేదిక(farmer platform) కార్యాలయంలో రైతులతో మాట్లాడారు. ప్రస్తుత యాసంగి (రవి) సీజన్ సాగుకు అవసరమైన పూర్తిస్థాయి యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు.

పంపిణీ సాఫీగా జరిగేందుకు ప్రణాళికలు రూపొందించామని, సహకార సంఘాలు ఇతర కేంద్రాలలో సరిపడ యూరియా అందుబాటులో ఉంచామన్నారు. పంపిణీలో పారదర్శకత కోసం యూరియా బుకింగ్ యాప్(Booking app)ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రైతులకు యాప్ వినియోగంలో సహకరించేందుకు పంపిణీ కేంద్రాల వద్ద వ్యవసాయ సహకార శాఖల సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రతి కేంద్రంలో యాప్ క్యూఆర్ కోడ్(QR code) ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భూక్య రాధ, మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Leave a Reply