Nagayalanka | దరఖాస్తులు చేసుకోవాలి

Nagayalanka | దరఖాస్తులు చేసుకోవాలి
- రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కౌంటర్లు
Nagayalanka | నాగాయలంక, ఆంధ్రప్రభ : భూ సమస్యలపై రైతులు రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పలు కౌంటర్లలో దరఖాస్తులు చేసుకోవాలని తహసీల్దార్ వీరాంజనేయ ప్రసాద్ కోరారు. సోమవారం కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసి వివిధ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ భూ సమస్యలు మండల పరిధిలో ఉంటే తక్షణమే పరిష్కరిస్తామని, డివిజన్ పరిధిలోనివి అయితే జిల్లా అధికారులకు పంపుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీ మండలి కేశవి, వీఆర్వో టీజీ ఎస్. సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.
