Makthal Ex MLA | క్రీస్తు బోధనలు మానవాళికి ఆదర్శం
Makthal Ex MLA | క్రీస్తు బోధనలు మానవాళికి ఆదర్శం
మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Makthal Ex MLA | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఏసుప్రభువు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy) అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొల్లూర్ గ్రామంలో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని చర్చిలో జరిగిన వేడుకలకు హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… క్రిస్మస్ పండుగ (Christmas festival) ప్రపంచానికి శాంతి ప్రేమ సోదర భావం వంటి మహానీయ విలువలను చాటి చెబుతుందన్నారు. ప్రతి ఒక్కరూ శాంతి, కరుణ, ప్రేమను పంచుకొని కలిసికట్టుగా ఉండాలన్నారు. ఏసుప్రభు సూచించిన మార్గంలో ప్రతిఒక్కరూ నడవాలని సూచించారు. అన్ని మతాలను గౌరవించడమే భారతీయ సంస్కృతికి ప్రత్యేకత అన్నారు. పాస్టర్ రవికుమార్ ప్రత్యేక ప్రార్థనలతో మాజీ ఎమ్మెల్యేను ఆశీర్వదించారు.
