108 Ambulance | బైక్‌తో చెట్టును ఢీకొని యువకుడు మృతి

108 Ambulance | బైక్‌తో చెట్టును ఢీకొని యువకుడు మృతి
108 Ambulance | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపలికి చెందిన దుమల్ల రాజు(26) పల్సర్ వాహనంతో మంగళవారం రాత్రి చెట్టును ఢీకొన్నాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష ఈ రోజు సాయంత్రం తెలిపారు.
రాజు మంగళవారం సాయంత్రం తన బావైన మండలంలోని ధర్మారం చెందిన నేరెళ్ల హరీష్ ను టీజీ 21 7875 నెంబరు గల పల్సర్ వాహనం(vehicle)పై ఎక్కించుకొని వెళ్లి ధర్మారంలో దించి, తిరిగి ఆ వాహనంపై బాదంపల్లికి వస్తుండగా, అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ధర్మారం గ్రామ సమీపాన రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనగా, తలకు బలమైన గాయం తగిలిందని ఆ తర్వాత 108 అంబులెన్స్(108 Ambulance) వాహనంలో చికిత్స నిమిత్తం లక్షేట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు మృతుని అన్న గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అన్నకు అప్పగించినట్లు ఆమె చెప్పారు.
