ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభం..

నిర్మల్, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణంలోని 1వ వార్డు గాంధీనగర్ కాలనీలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్మల్ మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి, స్థానిక కౌన్సిలర్ కత్తి నరేందర్ బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కత్తి నరేందర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మెప్మా ఆర్‌పీలు రమ, శ్రీవాణి, వార్డు అధికారి రాజు, నాయకులు మదిరే లింగన్న, మొగిలి రాజేష్, బొమ్మెడ రాజేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave a Reply