8Elephants| రైలు ఢీకొని ఏనుగులు మృతి

8Elephants| రైలు ఢీకొని ఏనుగులు మృతి

8Elephants | పట్టాలు తప్పిన బోగీలు


8Elephants| అస్సాం, ఆంధ్రప్రభ : ఏనుగుల మంద‌ను రైలు ఢీకొట్ట‌డంతో బోగీలు ప‌ట్టాలు త‌ప్పిన ఘ‌త‌న‌ అస్సాంలోని హొజాయ్ జిల్లాలో జ‌రిగింది. ఇవాళ‌ తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express) ఒక ఏనుగుల మందను బలంగా ఢీకొట్టింది. ఈ పెను ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. ఒక ఏనుగు పిల్ల తీవ్రంగా గాయపడింది.

8Elephants
8Elephants

8Elephants | ఆనంద్ విహార్ టెర్మినల్

ప్రమాద తీవ్రతకు రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మిజోరం (Mizoram) రాజధాని ఐజ్వాల్ సమీపంలోని సైరాంగ్ నుంచి న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వైపు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు శనివారం తెల్లవారుజామున సుమారు 2.17 గంటల సమయంలో ఈ ప్రమాదం ఎదురైంది.

8Elephants | వెంటనే అత్యవసర బ్రేకులు

గౌహతి (Guwahati) కి 126 కిలో మీటర్ల దూరంలో ఉన్న హొజాయ్ పరిధిలోకి రైలు చేరుకున్న సమయంలో ఒక ఏనుగుల మంద పట్టాలు దాటుతుండటాన్ని లోకో పైలట్ గుర్తించారు. వెంటనే అత్యవసర బ్రేకులు వేసినప్పటికీ.. అప్పటికే వేగంగా ఉన్న రైలు మందను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా.. పట్టాలపై వాటి అవయవాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిపోయాయి.

click here to read | DCP Dharakavita | తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఇక కేసులే..

click here to read more

Leave a Reply