Venkatapur | ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. పలువురికి గాయాలు..

Venkatapur | ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. పలువురికి గాయాలు..
Venkatapur | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని వెంకటాపూర్ (కె) శివారులోని పోచమ్మ వాగు వద్ద శుక్రవారం ట్రాక్టర్ ప్రమాదం జరిగింది. కల్వకుంట నుంచి ధర్మారం వెళ్తున్న ఇటుకల లోడ్ ట్రాక్టర్, అతివేగం కారణంగా అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు సమాచారం అందుకుని దర్యాప్తు చేస్తున్నారు.

