first-convocation : కేంద్రీయ వర్పిటీస్నాతకోత్సవం షురూ
first-convocation : కేంద్రీయ వర్పిటీ
స్నాతకోత్సవం షురూ
( ఆంధ్రప్రభ, అనంతపురం బ్యూరో)
first-convocation : అనంత పురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం బుధవారం ప్రారంబమైంది. ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. స్నాతకోత్సవ వేదిక వద్దకు నేటి ఉదయం 11:22 గంటలకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ , మంత్రి నారా లోకేశ్ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ , కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డా.శంకరఆచార్య, ఉపకులపతి ఆచార్య ఎస్.ఎ.కోరి హాజరయ్యారు.
first-convocation : రాష్ట్రపతికి ఘన స్వాగతం
అనంతపురం జిల్లా కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని హెలిప్యాడ్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ఎ.కోరి, ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు, అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ బి.విష్ణుచరణ్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఘనంగా ఆహ్వానం పలికారు.
