Winter Season | రైతులూ.. సూచనలు పాటించండి

Winter Season | రైతులూ.. సూచనలు పాటించండి

  • శీతాకాలంలోవరినారు మడి కోసం జాగ్ర‌త్త‌లు

Winter Season | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రైతులు శీతాకాలంలో (Winter Season) వరి నారు మడి కోసం వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు విధిగా పాటించాలని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఏవో గణేష్ రెడ్డి శీతాకాలం వరి నారుమడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.

  • నర్సరీ స్థలం ఎంపిక…

ఎత్తైన, నీరు నిల్వ ఉండని నేలను ఎంచుకోవాలిని మంచి సూర్యకాంతి పడే ప్రదేశం ఉండాలి.
గాలివానల నుండి రక్షణ ఉండేలా చూడాలి అన్నారు.

  • విత్తన శుద్ధి…
  • కిలో విత్తనానికి కార్బెండజిమ్, లేదా థైరమ్ – 2 గ్రాములు, లేదా ట్రైకోడెర్మా – 4 గ్రాములు శుద్ధి చేసిన విత్తనాలు మాత్రమే వాడాలి.
  • నారుమడి తయారీ వెడల్పు 1–1.2 మీటర్లు పొడవు ఉండాలి.
  • అవసరానికి అనుగుణంగా బెడ్ల మధ్య కాలువలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
  • బెడ్‌పై బాగా కుళ్లిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వేయాలని సూచించారు.
  • చలి నుంచి రక్షణ…
  • రాత్రి తీవ్రమైన చలి ఉన్నప్పుడు నర్సరీపై పాలిథిన్ షీట్లు, గోనె సంచులు పొడి గడ్డి కప్పాలి.
  • ఉదయం సూర్యోదయం తర్వాత తప్పనిసరిగా తొలగించాలినీటి నిర్వహణరాత్రివేళ పలుచని నీటి పొర ఉండాలనిఉదయం నీటిని పూర్తిగా వదిలివేసి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తతీసుకోవాలని సూచించారు.

ఎరువుల నిర్వహణ..
200 చదరపు మీటర్ల నర్సరీకి :
యూరియా – 1 కిలో
సూపర్ పాస్ఫేట్ – 2 కిలోలు
మూరియేట్ ఆఫ్ పొటాష్ – 1 కిలో
నాటిన 10–12 రోజుల తర్వాత
యూరియా 0.5 కిలో నీటిలో కలిపి పైపైకి చల్లాలని అన్నారు.

  • సూక్ష్మ పోషకాల వినియోగం
  • జింక్ లోపం ఉంటే జింక్ సల్ఫేట్ 2 గ్రా.లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి.
  • అవసరమైతే 10 రోజుల తర్వాత మళ్లీ స్ప్రే చేయాలన్నారు.
  • కలుపు నియంత్రణ
  • చిన్న దశలోనే చేతితో కలుపు తీయాలన్నారు.
  • నర్సరీ శుభ్రంగా ఉంచాలి
  • పురుగులు, వ్యాధుల నివారణ
  • ఆకు ముడుత , కాండం తోలుచు లాంటి పురుగులు కనిపిస్తే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మందులు వాడాలి
  • నర్సరీలో వ్యాధిగ్రస్త మొక్కలను వెంటనే తొలగించాలన్నారు.

ఆరోగ్యమైన మొక్కల ఎంపిక
నాటడానికి 20–25 రోజుల వయస్సు గల బలమైన, పచ్చగా ఉన్న మొక్కలను మాత్రమే పొలంలో నాటాలన్నారు.

ముఖ్య సూచనలు…

  • చలికాలంలో అధిక నీరు పంటకు హానికరం
  • ఉదయం సూర్యకాంతి తప్పనిసరిగా పడేలా చూడాలి
  • సర్టిఫైడ్ విత్తనాలు వాడటం వల్ల నర్సరీ వృద్ధి మెరుగుపడుతుంది

రైతు సోదరులు పైన తెలిపిన చర్యలు తీసుకుని వరి నారుమడిని చలి తీవ్రత నుండి రక్షించుకోవాలన్నారు. అధికారుల సూచనలతో రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయన్నారు.

Leave a Reply