ABVP |ఘ‌న స్వాగ‌తం.. సన్మానం

ఘ‌న స్వాగ‌తం.. సన్మానం

ABVP |ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఉట్నూర్‌లో మొదటిసారిగా ఇవాళ పర్యటించిన ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇందూర్ విభాగ్ సంఘటన మంత్రి హర్షవర్ధన్, బోధన్ ప్రముక్ ఈశ్వర్‌లకు ఉట్నూర్ ఏబీవీపీ విద్యార్థి నాయకులు కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉట్నూర్ పులాజి బాబా డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘ నాయకులు వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply