Doctor | కలిసొచ్చిన డాక్టర్ సేవలు ….

Doctor | కలిసొచ్చిన డాక్టర్ సేవలు ….
మహాద్వార్ గ్రామ సర్పంచ్ గా డాక్టర్ శ్రీనివాసరెడ్డి
Doctor | మక్తల్, ఆంధ్రప్రభ : డాక్టర్ (Doctor) గా అతను ప్రజలకు అందించిన సేవలు కలిసివచ్చాయి. ఆయన వద్దకు వైద్య సేవల కోసం వచ్చిన వారిలో ఉన్నవాడైనా, లేనివాడైనా వైద్య సేవలకు అంతా ఇంతా అని కాకుండా ఇచ్చినంత తీసుకొని వైద్య సేవలు అందించడం వల్ల అదృష్టం కలిసి వచ్చింది.
ఆ సేవలే ఆ డాక్టర్ (Doctor) ను గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపించాయి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మహాద్వార్ గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీనివాసరెడ్డి గత పదేళ్లుగా డాక్టర్ గా మక్తల్ లో క్లినిక్ నిర్వహిస్తున్నారు. వైద్యం కోసం ఆయన వద్దకు పరిసర గ్రామాల నుండి నిత్యం వందలాదిమంది వస్తుంటారు. వచ్చిన వారందరికీ ప్రేమతో పలకరించి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy) డాక్టర్ గానే కాకుండా గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలనె సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో బిజెపిలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో మూడవ విడత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహద్వార్ గ్రామ సర్పంచ్ గా బీజేపీ మద్దతుతో పోటీ చేశారు. సర్పంచిగా పోటీచేసిన ఆయనకు డాక్టర్ గా అందించిన వైద్య సేవలు కలిసొచ్చాయి. ఆయన ఎన్నికల్లో గెలిచేలా చేశాయి. గ్రామ సర్పంచ్ గా అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బీజేపీ మద్దతు (BJP support) తో పోటీ చేసిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇటు డాక్టర్ గా అటు సర్పంచ్ గా ఐదేళ్లలో ఓ మంచి సర్పంచ్ గా అనిపించుకోవడమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధి (Village development) కోసం పని చేస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహాద్వార్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. పదవిలో ఉన్న రోజుల్లో ఘనమైన సేవలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
