BRS Return | మ‌ళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్

BRS Return | మ‌ళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్

రేవంత్ ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడింది: కేటీఆర్

BRS Return | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనకు ఇప్పటికే “ఇంటర్వెల్” పడిందని, మొదటి సగం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోదగ్గ పని చేయలేదని ఆరోపించారు.

హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించిన ఆయన, బీఆర్ఎస్ హయాంలో జీఓ 58, 59 కింద లక్షలాది కుటుంబాలకు పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. అలాగే డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరింత బలపడుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.