Gannavaram | గంజాయి పట్టివేత..

Gannavaram | గంజాయి పట్టివేత..

Gannavaram, ఆంధ్రప్రభ : గన్నవరంలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిస్సా నుండి పూణే తరలిస్తున్న 120 కేజీల గంజాయిని అధికారులు పట్టుకోవటం జరిగింది. అక్రమంగా గంజాయి తరిస్తున్నారనే సమాచారంతో మంగళవారం రాత్రి ప్రత్యేక ఈగల్ పోలీస్ టీమ్ గన్నవరం వద్ద ఒక కారులో 120 కేజీల గంజాయి, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న వ్యక్తిని, గంజాయి కారుని గన్నవరం పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి వద్ద నుండి సమాచారం సేకరిస్తున్నారు.

Leave a Reply