Farmer | సోయా, మొక్కజొన్నలు తప్పనిసరిగా కొనాలి

Farmer | సోయా, మొక్కజొన్నలు తప్పనిసరిగా కొనాలి

  • రైతు బలిరాం డిమాండ్

Farmer | గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : మన్నూర్ గ్రామానికి చెందిన రైతు బలిరాం సోయా, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యార్డు పరిధిలో ఉన్న మొక్కజొన్న పంటలను మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు వెల్లడించారని తెలిపారు. ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ, మార్కెట్ అధికారులు నాణ్యతలేదని పేర్కొంటూ గోదాముల వద్ద పంటలను తిరస్కరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నాణ్యత ఉన్న పంటలను కూడా కొనుగోలు చేయడం లేదని వాపోయారు. తక్షణమే రైతుల పంటలను కొనుగోలు చేయకపోతే రైతులు ఆందోళనకు దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.