Gudivada | ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

Gudivada | ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎమ్మెల్యే పూజ‌లు


Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (Sri Subrahmanyeswara Swamy) వారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (MLA Venigandla Ramu) ఆకాంక్షించారు. గుడివాడ రూరల్ మండలం పర్ణాస గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి షష్టి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో ఎమ్మెల్యే, కూటమి నాయకులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులకు ఎమ్మెల్యే అభివాదాలు చేస్తూ షష్టి శుభాకాంక్షలు తెలిపారు.

వైభవంగా జరుగుతున్న స్వామివారి షష్టి వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని ఎమ్మెల్యే (MLA) హర్షం వ్యక్తం చేశారు. భక్తులందరూ షష్టి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాల అనంతరం వారికి వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించగా, దేవస్థాన కమిటీ పెద్దలు గౌరవ సత్కారం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ మండల అధ్యక్షుడు వాసే మురళి, టీడీపీ మండల నాయకులు కర్రె వెంకటగిరి, చీకటి శేషగిరిరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొరీపర్తి సుబ్బారావు, డైరెక్టర్ రషీద్ బేగ్, దేవస్థాన కమిటీ పెద్దలు కట్టా సుబ్రహ్మణ్యం, కుమారస్వామి, వెంకటేశ్వరరావు, గొర్ల ప్రసాద్, పట్టం అంజయ్య,గొల్ల సుబ్బారావు, గోరిపర్తి శ్రీనివాసరావు, బచ్చుల శివ, పల్లపోతు బసవయ్య, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply