Janasena | అందుకే.. నాదెండ్ల మనోహర్ పర్యటన..

Janasena | అందుకే.. నాదెండ్ల మనోహర్ పర్యటన..

Janasena, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కృష్ణా, ఏలూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla manohar) పర్యటిస్తున్నారు. బుధవారం 10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 10:45 నిమిషాలకు ఉయ్యూరు మండలం గండిగుంట ఆర్ఎస్కే ను సందర్శిస్తారు. 11:40 గూడూరు నేషనల్ హైవే జంక్షన్ వద్ద ధాన్యం కొనుగోలు గురించి రైతులతో మాట్లాడతారు. 12:45 మచిలీపట్నంలోని సీతారామాంజనేయ రైస్ మిల్లు, శ్రీ కన్యకా పరమేశ్వరి రైస్ మిల్లులను సందర్శిస్తారని, 1:45 నిముషాలకు పెడన మాదక బైపాస్ వద్ద రైతులతో మాట్లాడుతారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ముదినేపల్లి వడాలి రోడ్డులో పూర్ణిమ దియేటర్ దగ్గరలో ఉన్న స్థలంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారు.