AP | డీఎస్సీ పరీక్ష తేదీల మార్పు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో జూన్‌ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎం.వి.కృష్ణా తెలిపారు.

యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో పరీక్షల తేదీలను మార్చినట్లు ఆయన వివరించారు. ఆ అభ్యర్థులకు జులై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్పులు చేసిన హాల్‌ టిక్కెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో ఈనెల 25వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతామన్నారు.

అభ్యర్ధులు ఈ విషయాన్ని గుర్తించి తేదీలు మార్పుల చేసిన కొత్త హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోని వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాలని డీఎస్సీ కన్వీనర్‌ సూచించారు.

Leave a Reply