44th N H | పోలీస్ వాహనంలో తరలింపు

44th N H | పోలీస్ వాహనంలో తరలింపు

44th N H | సదాశివనగర్, ఆంధ్రప్రభ : సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామ శివారులో ఈ రోజు 44వ జాతీయ రహాదారి(44th National Highway)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలైనట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. మండలంలోని భూంపల్లి గ్రామానికి చెందిన కమ్మరి నవీన్(Blacksmith Naveen), కమ్మరి సౌందర్య ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి డివైడర్‌ను(Divider) ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తమ సొంత పెట్రోలింగ్ కారు(patrol car)లో ప్రథమ చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై పుష్పరాజ్, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో తక్షణమే వైద్య సహాయం అందించగలిగామని వైద్యులు తెలిపారు.