Telangana | ఉన్న‌త స్థాయికి ఎద‌గాలి….

Telangana | ఉన్న‌త స్థాయికి ఎద‌గాలి….

Telangana |తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండలంలోని జడ్పీ హెచ్స్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తాడ్వాయి ఎంపీడీఓ మాట్లాడుతూ.. పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థానానికి రావాలని, పేరెంట్స్ విద్యార్థులను క్రమం తప్పకుండ పాఠ‌శాలకు పంపించాలని కోరారు.

ఈ సందర్బంగా ఎం ఈ ఓ గడ్డి శ్రీనివాస్(M.E.O. Gaddi Srinivas) మాట్లాడుతూ.. విద్యార్థులు అన్నీ అంశాలలో చురుకుగా పాల్గొనడం చాలా సంతోష‌మ‌ని, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటేనే అభివృద్ధి చెందుతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కొట్టం మల్లికాంబ(Kottam Mallikamba), జడ్పీ హెచ్స్ ఇందిరానగర్ హెచ్ ఎం రేణుక, ఉపాధ్యాయులు శంకర్, లక్ష్మయ్య, వసంతరావు, స్వామి, స్రవంత్, వనిత, ఎం పి పి ఎస్ కృష్ణయ్య, ఎం ఆర్ సి సిబ్బంది నీలంబాబు, సారయ్య, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply