- ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు
గోదావరిఖని (ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 11 ఇంక్లైన్ బొగ్గు గనిలో బుధవారం రాత్రి రెండవ షిఫ్ట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సింగరేణి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. గనిలోని ఎల్‌హెచ్‌డీ మిషన్ వెనుక పనిచేస్తున్న రంజిత్, శ్రీకాంత్, ప్రవీణ్‌లకు అకస్మాత్తుగా కేబుల్ తగిలి గాయాలయ్యాయి. ఘటన అనంతరం సహచర కార్మికులు వారిని వెంటనే గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల ప్రకారం రంజిత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా ఇద్దరికి కూడా బలమైన గాయాలు కాగా, ముగ్గురికీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

