కొనుగోలు కేంద్రాల్లో వసతులు కరవు

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కరవు

-రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలి.
-ధాన్యం తరలింపు లో జాప్యం.
-మాజీ మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్

ధర్మపురి, ఆంధ్రప్రభ:

ధర్మపురి మండలంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరైన వసతులు లేవని కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. సోమవారం ధర్మపురి మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు బీఆర్ఎస్ నాయకుల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా మండలంలో వరి ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

ఒక బస్తాకి తరుగు పేరునా 42కిలోల 200 గ్రాములు జోకుతున్నారు. దాదాపు క్వింటాలుకు 5 కిలోలు కటింగ్ చేస్తున్నారు మా ప్రభుత్వాన్ని అనవసరంగా బధనం చేసిన మీరు ఇప్పుడు కటింగ్ చేసిన డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 45 డిగ్రీల ఎండలో రైతులు నెల రోజులుగా ఇబ్బంది పడుతున్నారని దేశంలో ఎద్దు ఏడ్చినా వ్యవసాయం రైతు ఏడ్చినా రాజ్యం ఎన్నడూ బాగు పడ్డట్టు చరిత్రలో లేదు అన్నారు. మీ ప్రజా పాలననా లో ఎం జరుగుతుందని ఒక్కసారి మార్కెట్ యార్డ్ కి వచ్చి పరిశీలించలని కోరారు.

జోకిన బస్తాలు కూడా పది రోజులు అయినా వాటిని తీసుకుపోవడం లేదని, కనీసం రైతులను బస్తాలకు కట్టే సుతిలు దారములు, సీరియల్ నెంబర్ రాసే ఇంక్ బాటిల్స్ కూడా రైతులనే కొనుక్కోవాలని చెప్పడంతో ప్రభుత్వం అధికారుల పని తీరుకు అద్దం పడుతుందని చిన్న వస్తువులను కూడా ఈ ప్రభుత్వం సమాకుర్చలేదా అని ప్రశ్నించారు. వీలైనంత త్వరగా వడ్లు కొనుగోలు చేయాలని రైతుల సమస్యలు పరిష్కరించాలని లేనిచో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

అనంతరం మార్కెట్ కొనుగోలు కేంద్రాల పరిస్థితులు డిప్యూటీ తహసీల్దార్ తిరుపతికి వివరించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మెన్ సంగి సత్తెమ్మ , బీఆర్ఎస్ పార్టీ పట్టణ కన్వీనర్ బండారి రంజిత్ నాయకులు ఓడ్నాల మల్లేశం,చిలువేరి శ్యామ్ సుందర్,మాజీ వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్ రెడ్డి, చిర్నెని నర్సయ్య, బండారి అశోక్,తరాల కార్తీక్, ఎస్డి అసిఫ్,ఎండీ శమీమా,ఆనందాసు శ్రీనివాస్, కాశెట్టి విజయ్, మూటపెల్లి లడ్డు,కళ్లెం రిషి రెడ్డి,గొల్ల మల్లేష్,మొలుగూరి ప్రశాంత్,భోగ రమేష్,అబ్దుల్ జావీద్,నూనె సాయి, అంబటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply