CMRF | నిరుపేదల పాలిట వరం

CMRF | నిరుపేదల పాలిట వరం

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..
పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కొండంత భరోసా…
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 25.90 లక్షల చెక్కులు పంపిణీ…


కర్నూల్ రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదల పాలిట వరంగా మారిందని రాష్ట్ర రోడ్లు అండ్ భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) పేర్కొన్నారు. బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 41 మంది బాధితులకు రూ. 25,90,767ల‌ లక్షల విలువైన చెక్కులు మంత్రి చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగింది. చెక్కుల పంపిణీ సందర్భంగా వైద్య సహాయం అందుకున్న రోగుల ఆరోగ్యం – యోగక్షేమాలు మంత్రి అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ కొండంత భరోసానిస్తోందన్నారు. నిరుపేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నేడు రాష్ట్రంలో ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కుటుంబ పెద్ద అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబం అప్పుల వలలో చిక్కుకోకుండా ముఖ్యమంత్రి సహాయనిధి ఆదుకుంటుందన్నారు.. సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) చెక్కులు అందుకున్న బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మంత్రి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply