Tollywood | కళ్యాణ్ రామ్ కొడుకు వీడియో వైరల్

Tollywood | కళ్యాణ్ రామ్ కొడుకు వీడియో వైరల్
Tollywood | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నందమూరి వంశం నుంచి ఇప్పటికే పలువురు హీరోలు టాలీవుడ్‌కు పరిచయమై, తమదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు అదే వంశం నుంచి మరో యువ హీరో తెలుగు తెరకు పరిచయం కావడానికి సిద్ధమవుతున్నట్టుగా చర్చ జరుగుతోంది. అతడెవరో కాదు.. నందమూరి కళ్యాణ్ రామ్ కుమారుడు శౌర్యరామ్.
ఇటీవల శౌర్యరామ్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ, కిక్‌బాక్సింగ్ నేర్చుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఆ వీడియోలో శౌర్యరామ్ చేతులకు గ్లౌజులు ధరించి, ప్రొఫెషనల్ కోచ్ పర్యవేక్షణలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. దీనిని చూసిన అభిమానులు, శౌర్యరామ్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే చర్చను మొదలుపెట్టారు. అంతేకాదు, తండ్రి కళ్యాణ్ రామ్‌లాగే తనయుడు కూడా పెద్ద హీరో అవుతాడని కామెంట్లు చేస్తున్నారు.
ఇదే నిజమైతే, నందమూరి అభిమానులకు త్వరలోనే మరో శుభవార్త వినిపించే అవకాశముంది. శౌర్యరామ్ సినీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తే, అది అభిమానులకు నిజంగానే పండగనే చెప్పాలి.
కాగా, కళ్యాణ్ రామ్ గతంలో ‘అమిగోస్’, ‘డెవిల్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న వెంకటేష్‌తో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఈ సమయంలోనే శౌర్యరామ్ ఎంట్రీపై వస్తున్న వార్తలు నందమూరి అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
CLICK HERE TO READ Megastar | మరోసారి టాలీవుడ్‌లో హాట్ డిస్కషన్..
