అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలే…

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలే…
నలగొండ, ఆంధ్ర ప్రభ : జిల్లా కేంద్రంలో అక్రమ ఇసుక దందాలకు పాల్పడుతున్న వారిపై ఈ రోజు మైనింగ్ జిల్లా అధికారి శ్యాముల్ జాకాబ్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులతో ఈ రోజు మెరుపు దాడి నిర్వహించారు. కనగల్, నర్సింగ్ బట్ల(According to Kanagal, Nursing) వివిధ ప్రాంతాల నుండి ఇసుక అక్రమ దందాలకు పాల్పడుతున్నారని సమాచారంతో మైనింగ్ ఏడి శ్యామల్ జాకాబ్(Mining Add Shyamal Jacob), వన్ టౌన్ సిఐ వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహా లక్ష్మయ్య, మైనింగ్ శాఖ అధికారులు పోలీసు సిబ్బందితో కలిసి దేవరకొండ రోడ్డు జేఎల్ గార్డెన్ సమీపంలో ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్లను తనిఖీ(Inspection of sand tractors) నిర్వహించి అక్రమ దందాలకు పాల్పడుతున్న బ్రోకర్లను గుర్తించి అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
లబ్ధిదారులకు నాణ్యమైన ఇసుకను అందించాలని లబ్ధిదారుడు మాత్రమే బుకింగ్(Booking) చేసుకోవాలని ఇతర వ్యక్తులు ఎవరైనా బుకింగ్ చేసి అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక అవసరం ఉన్న లబ్ధిదారులు ప్రతి ఒక్కరు బుకింగ్ చేసుకోవాలని బ్లాకులో ఎలాంటి ఇసుకను కొనుగోలు చేయకుండా నేరుగా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాన్ని వినియోగించుకొని బుకింగ్ ద్వారానే తీసుకోవాలని సూచించారు.

