వైద్యుడి ఆత్యహత్మకు కారణం ఇదే..

వైద్యుడి ఆత్యహత్మకు కారణం ఇదే..
అశ్వారావుపేట, ఆంధ్రప్రభ: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని తల్లి ఒడిలో కూర్చుని చిన్నారి అమ్మా.. నాన్న కావాలి.. నాన్నకావాలి.. అంటూ రోధిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కలకత్తాకు చెందిన సర్కార్ న్యూటన్ కుమార్ (43) సుమారు 20 సంవత్సరాలు క్రితం అశ్వరావుపేటకు వచ్చారు. ఇక్కడ మొలల వైద్యం చేస్తూ స్థిరపడ్డారు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. ఆ వైద్యుడు మద్యానికి బానిస అయ్యాడు. గడిచిన కొంతకాలంగా తీవ్రంగా మద్యం సేవిస్తూ ఆహారం తీసుకోవడం లేదట.. పైగా అప్పుల భారంతో తీవ్ర మనోవేదనకు గురైయ్యాడు.
శుక్రవారం ఉదయం తన క్లినిక్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలుసుకున్న భార్య తన ఇద్దరు పిల్లలతో క్లినిక్ వచ్చి మృతదేహం వద్ద బోరున విలపించారు. అతని కుమారుడు, కుమార్తె ఏడవడం సంఘటనా స్థలంలో ఉన్న వారిని కలచివేసింది. చిన్నారులు చాక్లెట్ కోసం మారాం చేసినట్లు అమ్మ నాకు నాన్న కావాలి.. కావాలి అంతే.. అని ఏడుస్తుండటంతో చూస్తున్న వాళ్ళు పలువురు కంటతడి పెట్టారు. ఈ సంఘటన పై అడిషనల్ సబ్ ఇన్స్పెక్టర్ అఖిల దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

