యువతి అదృశ్యం

శ్రీ సత్యసాయి బ్యూరో, సెప్టెంబర్ 12 (ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) జిల్లా కదిరి టౌన్, శివాలయం వీధికి చెందిన ఓ యువతి శుక్రవారం అదృశ్యమైనట్టు (Missing) కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి రెడ్డి తెలిపారు.

రవి నాయక్ (Ravi Nayak) అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన అక్క కూతురు చిన్నప్పటి నుండి వారి ఇంట్లోనే ఉంటుందని చెప్పారు. అయితే ఈరోజు ఉదయం 9గంటల సమయంలో ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేసి వస్తానని చెప్పి ఆ అమ్మాయి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. ఈ విషయంలో చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె గురించి విచారించగా, ఆమెతో కదిరి రూరల్ మండలం, దిగువపల్లి గ్రామానికి చెందిన మహేష్ నాయుడు (Mahesh Naidu) అనే వ్యక్తి చనువుగా ఉంటాడని, ఆ వ్యక్తి మీద తమకు అనుమానం ఉందని చెప్పారు. రవి నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు (case Registration) చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply