Market | 109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
Market | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన ప్రధాన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా అదే జోరును కొనసాగించాయి. ఎంపిక చేసిన రంగాల్లో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 109.25 పాయింట్లు లేదా 0.14 శాతం పెరిగి 77,100.47 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 34.35 పాయింట్లు లేదా 0.14 శాతం లాభపడి 24,056.00 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ వరుసగా 24 వేల పాయింట్లకు పైనే కొనసాగింది.
వ్యక్తిగత షేర్లలో గుజరాత్ నేచురల్ రిసోర్సెస్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్, సాక్‌సాఫ్ట్, రిలాక్సో ఫుట్‌వేర్స్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు టీసీఐ ఎక్స్‌ప్రెస్, జెనెసిస్ ఇంటర్నేషనల్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లో ఎంపిక చేసిన రంగాల్లో కొనుగోళ్ల ఆసక్తి కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ దేశీయ పెట్టుబడిదారుల విశ్వాసం కొనసాగడంతో సూచీలు లాభాల్లో ముగిశాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
