టీడీపీ ఇంటింటి ప్రచారం..
ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు
అమలాపురం, ఆంధ్రప్రభ: ఉప్పలగుప్తం గ్రామంతో పాటు అమలాపురం పట్టణంలోని 9వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పాల్గొని ప్రజలను నేరుగా కలుసుకున్నారు.
ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే.. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అదే సమయంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసం పెరుగుతోందన్నారు.
ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకమే తమకు కొండంత బలమని ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు.
