రూ.15.55 లక్షల చెక్కుల అందజేత

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ఆపదలో ఉన్న వారికి అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. కాళ్ళ మండలం పెదఅమిరంలో ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కార్యక్రమం నిర్వహించారు. 20వ విడతలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు.

ఈ విడతలో రూ.15,55,679 విలువైన చెక్కులను 31 మందికి అందించమన్నారు. చాలా వేగవంతంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి నాగరాజు, మురళీకృష్ణంరాజు, మోగల్లు బాబు, పాల వెంకట చలపతి, కౌరు శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.