AP | ప్రజా కళలను ప్రోత్సహించాలి..

AP | ప్రజా కళలను ప్రోత్సహించాలి..
ప్రజా నాట్యమండలి మహాసభలకు ఏర్పాట్లు షురూ
పి ఎన్ యం జిల్లా కార్యదర్శి ఐ వి
AP | విఆర్ పురం , ఆంధ్రప్రభ : కళ కళ కోసం కాదు కళలు ప్రజల కోసం అనే నినాదంతోపనీచేస్తున్న ప్రజానాట్యమండలి మండల మహా సభలకు విఆర్ పురం వేదిక కానుంది.మంగళవారం మండలంలో అడవి వెంకన్నగూడెం గ్రామంలో ఆహ్వాన సంఘం సమావేశానికి పి ఎన్ యం జిల్లా కార్యాదర్శి ఐ.వెంకటేశ్వరావు ఐ వి ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు.ఈసమావేశానికి పి ఎన్ యం నాయకులు కుంజా సుధీర్ కుమార్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ఐ వి మాట్లాడుతూ పాలకులు ప్రజా వ్యతిరేక విధానంపై కళల ద్వారా ప్రజలలో చైతన్యము తీసుకు రావాలని ఆదిశగా ఇక్కడ జరగబోయే మహాసభ వేదిక కానుందని అన్నారు. విధి విధానాలు భవిషత్ ప్రణాళిక తో కళల ద్వారా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కళాకారులపై ఉందని సూచించారు.ఈ సమావేశంలో ప్రజా నాట్యమండలిజిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్.సుబ్బారావు , కుంజా నాగిరెడ్డి, కారం సుందరయ్య, చిలకం పవన్, మడకం దారమ్మ తదితరులు పాల్గొన్నారు.
