రేణుక ఎల్లమ్మకు భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ

మొక్కులు చెల్లించుకున్న రాంనగర్ కాలనీ వాసులు

చిట్యాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ, కంఠమేశ్వర దేవాలయంలో మంగళవారం రాంనగర్ కాలనీ వాసులు, మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.

డప్పు చప్పుళ్ల నడుమ బోనాలతో ఆలయానికి చేరుకున్న భక్తులు రేణుక ఎల్లమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

పిల్లాపాపలతో తమ కుటుంబాలను సుఖసంతోషాలతో కాపాడాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.