దివిసీమ గాంధీ మండలికి విక్కుర్తి నివాళి…

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : దివిసీమ గాంధీగా పేరుగాంచిన ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ పునర్నిర్మాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా మంగళవారం అవనిగడ్డ వంతెన సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ… మండలి వెంకట కృష్ణారావు దివిసీమ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. 1977 దివిసీమ ఉప్పెన అనంతరం వేలాది మంది బాధితులను ఆదుకొని, ప్రాంత పునర్నిర్మాణానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. ప్రజాసేవే పరమావధిగా భావించి నిరాడంబర రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. మండలి వెంకట కృష్ణారావును దివిసీమ గాంధీగా ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విక్కుర్తి రాంబాబు,కొల్లూరి వెంకటేశ్వరరావు,యాసం చిట్టిబాబు,అవనిగడ్డ ప్రకాశం,బండే రాఘవ,అన్నపరెడ్డి లక్ష్మణ,ఘంటసాల రాజమోహనరావు,,విక్కుర్తి రామకృష్ణ,అడపా వెంకటేశ్వరరావు,మురాద్,పర్చూరి దుర్గాప్రసాద్, లుక్క శ్రీనివాసరావు, షేక్ బాబావలి, ముళ్ళపూడి శ్రీనివాసరావు,లింగం బాబూరావు, పులిగడ్డ చంద్ర, భూపతి నాంచారయ్య, బర్మా బుజ్జి, రేపల్లె ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.