ప్రజలకు సరసమైన ధరలో నాణ్యమైన బియ్యం: ప్రత్తిపాటి శ్రీధర్
కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ : విజయవాడలోని కేదారేశ్వరపేట రైతు బజార్‌లో తక్కువ ధరకే బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయ కౌంటర్‌ను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక విక్రయ కౌంటర్‌లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించిన వారు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందిస్తోందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాటి శ్రీధర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ ఆర్‌ఐ శ్రీనివాస్, ఈవో కరుణాకర్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
