అమ్మవారికి బంగారు నత్తుబొట్టు విరాళం
19.500 గ్రాముల బంగారు ఆభరణం సమర్పించిన దాత
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయనగరం పట్టణంలోని గాజులరేగ ప్రాంతానికి చెందిన కే. సత్యనారాయణ, అప్పాయమ్మ దంపతులు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తిపూర్వకంగా 19 గ్రాముల 500 మిల్లీగ్రాముల బరువున్న బంగారు నత్తుబొట్టు (బొల్లా)ను విరాళంగా సమర్పించారు.
సుమారు రూ.3 లక్షల విలువైన ఈ బంగారు ఆభరణాన్ని ఆలయ సూపర్డెంట్ నాగేశ్వరరావుకు అందజేసి అమ్మవారి సన్నిధికి కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా సూపర్నెంట్ నాగేశ్వరరావు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానాలయ ఇన్స్పెక్టర్ జగన్ తో పాటు ఇతరులు ఉన్నారు.

