Bhogapuram | మంత్రి అనిత వంగలపూడి ట్వీట్‌

విశాఖపట్నం, ఆంధ్రప్రభ: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు ఒక కొత్త ఆరంభమని రాష్ట్ర మంత్రి అనిత వంగలపూడి పేర్కొన్నారు. చారిత్రాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటోలను నేడు షేర్‌ చేస్తూ.. సామాజిక మాధ్యమం ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ ట్వీట్‌ లో.. ” ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా బలమైన మౌలిక సదుపాయాలు అవసరం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కొత్త అవకాశాలను, కొత్త పెట్టుబడులను, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను తీసుకురానుంది.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం–రాష్ట్రం కలిసి ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంలో భాగస్వామిగా ఉండటం ఆనందంగా ఉంది. ఈ మహత్తర ప్రాజెక్టు సాకారానికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు.

ప్రజల ఆకాంక్షలను అభివృద్ధిగా మలచే ఇలాంటి మరెన్నో అడుగులతో నవ్యాంధ్ర మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.” అని పేర్కొన్నారు.