చిరంజీవి యువత నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం
నర్సాపురం, ఆంధ్రప్రభ: నర్సాపురం నియోజకవర్గ చిరంజీవి యువత నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నియోజకవర్గ అధ్యక్షుడిగా పోలిశెట్టి సాంబ, ప్రధాన కార్యదర్శిగా చెన్నంశెట్టి నాగు ఎంపికయ్యారు. స్థానిక తెల్లగా కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ చిరంజీవి యువత సమావేశంలో కమిటీని అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా గన్నాబత్తుల రామ్ కుమార్, జక్కం చిన్న, సహాయ కార్యదర్శిగా ఉలిశెట్టి మూలస్వామి నాయుడు నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన చిరంజీవి యువత ప్రతినిధులకు సభ్యులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు. అధ్యక్షుడు పోలిశెట్టి సాంబ, ప్రధాన కార్యదర్శి చెన్నంశెట్టి నాగు మాట్లాడుతూ.. అభిమాన నాయకుడు, ప్రజా సేవాతత్పరుడు చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.
చిరంజీవి పుట్టిన రోజు వారోత్సవాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఆయన చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోపల్లి శ్రీనివాస్, పోలిశెట్టి సత్తిబాబు, అడ్డాల బాబి, దాసరి కృష్ణాజి, పిల్లా శ్రీహరి, బల్ల సత్తిబాబు, పులపర్తి ప్రతాప్, దివి సత్యన్, మేడిది ప్రభాకర్, పులపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
