వైభవంగా శ్రీ ఆందోల్ మైసమ్మ బోనాల ఉత్సవాలు
అఖండ దీపారాధన, గణపతి పూజతో ప్రారంభమైన వేడుకలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం గ్రామంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానంలో 21వ బోనాల ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు సందర్భంగా దేవాలయంలో అఖండ దీపారాధన, గణపతి పూజ, భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నల్గొండ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె. భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు దేవస్థాన చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి సల్వాది మోహన్ బాబు తెలిపారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు దాతలు కొమిరిశెట్టి విజయ్ కుమార్–శిరీష దంపతుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఈడుదుల బాబు, బేతాళ నరసింహ, సిద్ధిపేట ఆనందరెడ్డి, వెంకిర్యాల శివ, బాలగోని శ్రీకాంత్ గౌడ్, బొంతల యువరాజ్, మన్నె మహేందర్ రెడ్డి, దౌడీ రాజేష్ పన్నాల, మహేందర్ రెడ్డి, దేప రాజీవ్, పంతంగి రమేష్, జొన్నగంటి దాసు, చిట్టెంపల్లి సబిత, వల్లూరి శివప్రసాద్ శర్మతో పాటు గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
