పంటల భీమా నమోదుకు గడువు పొడిగింపు..

రాప్తాడు, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఆగస్టు 15వ తేదీ వరకు అవకాశం ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణచైతన్య తెలిపారు.

రాప్తాడు మండల వ్యవసాయ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పంటల బీమా నమోదు గడువును పొడిగించడం రైతులకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు.

పీఎంఎఫ్‌బీవై పథకం కింద కంది, వరి, జొన్న, మొక్కజొన్న, మిరప, ఆముదం, శనగ, సజ్జలు, కొర్ర, ఎర్రగడ్డ తదితర పంటలకు బీమా సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు.

ఇప్పటి వరకు పంటల బీమా నమోదు చేయించుకోని రైతులందరూ ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుని ఆగస్టు 15లోగా బీమా నమోదు పూర్తి చేసుకోవాలని కృష్ణచైతన్య సూచించారు.