Murder | రాజ‌కీయ క‌క్ష‌లే కార‌ణ‌మా?

Murder | రాజ‌కీయ క‌క్ష‌లే కార‌ణ‌మా?

మధు హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలు

హంతకులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా కృషి చేస్తాం.
పిడి యాక్ట్ పెట్టీ జైలుకు పంపిస్తాం, బెయిల్ లభించకుండా చేస్తాం.
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

Murder | సూర్యాపేట, ఆంద్ర‌ప్ర‌భ : సూర్యాపేట, ఆంధ్రప్రభ : హత్యకు గురైన ఏర్కారం గ్రామానికి చెందిన మధు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో జిల్లా ఎస్పి నరసింహ పరిశీలించి మృతుని బంధువులతో మాట్లాడారు. హంతకులను త్వరగా పట్టుకుంటామని కేసును అన్ని కోణాల్లో పటిష్టంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా పోలీసు శాఖ కృషి చేస్తుందని బంధువులకు ఎస్పి హామీ ఇచ్చారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ఏర్కారం గ్రామ శివారులో రోడ్డు పక్కన కల్వర్టు క్రింద గోనె బస్తాలో శవం ఉన్నదన్న సమాచారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటికి తీసి.. గోన సంచిలో దొరికిన మృతి దేహం ఎర్కారం గ్రామానికి చెందిన చింతలపాటి మధు గా గుర్తించి బంధువులను పిలిపించి నిర్ధారించడం జరిగిందన్నారు. చింతలపాటి మధు శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు ఇంట్లో నుండి వెళ్ళాడని ఆచూకీ తెలియడం లేదని సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు అతని భార్య ఫిర్యాదు చేయగా మొదటగా ఈ ఫిర్యాదు పై మిస్సింగ్ కేస్ నమోదు చేసి, హత్య కేసుగా మార్పు చేయడం జరిగిందన్నారు. ఈ కేసును సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేస్తున్నారని డి.ఎస్.పి ప్రసన్నకుమార్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. నిందితులను పట్టుకోవడం కోసం 5 ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశామని నిందితులను పట్టుకుని కఠిన శిక్షలు పడేలా త్వరితగతిన దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులపై పీడి యాక్ట్ పెట్టి బెయిల్ దొరకకుండా జైలులోనే ఉండేలా కృషి చేస్తామన్నారు. సంఘటనపై టెక్నికల్ ఆధారాలు సాక్షుల ఆధారాలు బలంగా నమోదు చేస్తామని అన్నారు. చట్టం ఉల్లంఘన చర్యలకు పాల్పడుతూ భౌతిక దాడులు చేస్తూ హత్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు అమలైతాయని పోలీసు అత్యంత వేగంగా కేసులు దర్యాప్తు చేస్తుందని తెలిపారు. జిల్లా పరిధిలో గతంలో జరిగిన హత్య కేసులలో నిందితులకు శిక్ష పడిన విషయాన్ని గుర్తు చేశారు. కేసు పట్టిష్టంగా దర్యాప్తు చేస్తున్నామని నిందితులను త్వరగా పట్టుకుని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం మృతదేహం లభించిన సంఘటన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.

మండలం యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైయ్యారు. నిన్న ఉదయం 10 గంటలకు సూర్యాపేటలో తన నివాసం నుండి పని నిమిత్తం బయటకు వెళ్లిన మధు సాయంత్రం నుండి ఫోన్లో సైతం అందుబాటులో లేకుండా పోయాడు. రాత్రి 10 గంటలకు మధు హత్యకు గుర‌య్యాడని ప్రచారం జరగగా అర్ధరాత్రి 1.30 గంటలకు యర్కారం గ్రామ శివారులోని ఓ పిల్ల కాలువలో హత్య చేసిన మధు మృతదేహన్నీ పోలీసులు గుర్తించి మృతదేహాన్ని హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

Murder |
Murder |

యర్కారం గ్రామం ఫాక్షన్ పరంగా సున్నితమైన గ్రామం కావడంతో గ్రామంలో పోలీసులు పికెట్ పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడు మధు మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడు కావడంతో రవీందర్ వర్గీయులు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు .

Murder |
Murder |

యర్కారం గ్రామంలో రాజకీయ హత్యల పరంపర కోనసాగుతుంది, 1985 ప్రాంతంలో గ్రామ టీడీపీ నాయకుడు యలగందుల సిద్దయ్య సూర్యాపేటలో దారుణ హత్యకు గురైయ్యారు అప్పటి నుండి తాజాగా జరిగిన మధు హత్య వరకు సుమారుగా ఎనిమిది మంది రాజకీయ కక్షలు బలైయ్యారు . 1985 లో యలగందుల సిద్దయ్య హత్య తరవాత కాంగ్రెస్ నేత పల్లె ఈదయ్య అనంతరం 1996 సిద్దయ్య కుమారుడు అజయ్ హత్యకు గురైయ్యాడు అప్పటి నుండి గ్రామం నీవురుగప్పిన నిప్పులా మారింది. అజయ హత్య జరిగిన కొద్దీ రోజులకే అప్పటి గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్ పై హత్యా యత్నం జరిగింది ఆ ఘటనకు చింతలపాటి చిన్న రమేషే కారణమని భావించి 1999లో రమేష్ ని హత్య చేశారు . రమేష్ హత్య అనంతరం కొంత కాలం ప్రశాంతంగా ఉన్న గ్రామం తిరిగి 2007లో మిద్దె రవీందర్ హత్యతో భగ్గుమంది . రవీందర్ హత్యతో పోలీసులు గ్రామం పై ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలో మరో ఘటన జరగకుండా అన్ని వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సమన్వయం చేశారు .

కొద్దీ రోజులపాటు పోలీసుల చర్యలు ఫలితాల ఇచ్చి గ్రామం ప్రశాంతంగా మారింది . ఇంతలోనే 2020 లో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నని గ్రామంలో దారుణంగా హత్య చేశాడు ప్రత్యర్థి వడ్డే ఎల్లయ్య అయితే 2024 ఎల్లయ్యని జగ్గయ్యపేట సమీపంలో అతని ప్రత్యర్థి శ్రీకాంతా చారి హత్య చేశాడు. చింతలపాటి మధు 25 ఏళ్ళ క్రితం జరిగిన గ్రామ మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు తాజా ఘటన రవీందర్ వర్గీయులు చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . వరుస హత్య ఘటనలతో గ్రామం మాత్రం అట్టుడికిపోతుంది , గ్రామం పెరు చెబితేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని కుటుంబాలు రాజకీయ కారణాలతో నలిగిపోయి గ్రామం వదిలి వెళ్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా గ్రామం పై ప్రత్యేక దృష్టి పెట్టి మునుముందు ఎలాంటి ఘటనలు, హత్యలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

CLICK HERE TO READ MORE : Masab Tank | కారుతో ఢీకొట్టి…

CLICK HERE TO READ MORE

Leave a Reply