అధికారుల సమిష్టి కృషితోనే అభివృద్ధి

డిప్యుటేషన్‌పై వెళ్తున్న ఎంపీడీవో అల్లాడి వనజకు ఎమ్మెల్యే సన్మానం

కుంటాల, ఆంధ్రప్రభ: అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు.

శనివారం కుంటాల మండల ఎంపీడీవోగా విధులు నిర్వహించిన అల్లాడి వనజ డిప్యుటేషన్‌పై లక్ష్మణచందా మండల ఎంపీడీవోగా వెళ్లనున్న సందర్భంగా ఆమెను శాలువా కప్పి, పూల బొకేతో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమిష్టి కృషితో అధికారులు పనిచేస్తే గ్రామాల్లో అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. మండల అభివృద్ధికి ఎంపీడీవో అల్లాడి వనజ చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు.

మండలంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించాలని సూచించారు. జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.

అనంతరం బదిలీపై వెళ్తున్న ఎంపీడీవో అల్లాడి వనజకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె సేవలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఆడే కమల్ సింగ్, ఇన్‌చార్జి ఎంపీడీవో శోభన, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.