హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జెడ్పి సీఈవో శోభారాణి

హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జెడ్పి సీఈవో శోభారాణి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తూఫ్రాన్ పేట గ్రామ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్ ను జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ షెడ్డును, సరుకులను, వంటకాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply