వ్యాపారంలో ప్రజల ఆదరాభిమానాలను పొందాలి- చిరుమర్తి
వ్యాపారంలో ప్రజల ఆదరాభిమానాలను పొందాలి- చిరుమర్తి
చిట్యాల, మే 3 (ఆంధ్రప్రభ) చిట్యాల మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మర్ల రాంరెడ్డి అల్లుడు హైదరాబాద్ వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన జైత్రా కిచెన్, బార్ మరియు బ్యాంకేట్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాదులో ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాజమాని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మర్యాదపూర్వకంగా శాలువ, పూల బోకేతో సన్మానించారు.

