బుద్దా వెంకన్నకు మాజీ కార్పొరేటర్ల మర్యాదపూర్వక భేటీ

భవానిపురం, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్నను ఆయన నివాసంలో మాజీ కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, అత్తలూరి పెద్దబాబు, మరుపిల్ల రాజేష్, బోలా విజయ్‌కుమార్, గుడివాడ నరేంద్ర, మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.