ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్
భవానిపురం, ఆంధ్రప్రభ: ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ,ఎన్డీయే కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, కూటమి నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పింఛన్లు,ఇళ్ల స్థలాలు, లవైద్య సహాయం,ప్రభుత్వ పథకాలు,ఇతర స్థానిక సమస్యలకు సంబంధించిన అంశాలపై వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ ముఖ్య లక్షమన్నారు.ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా ఎమ్మెల్యే కార్యాలయం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ సేవలు ప్రతి అర్హుడికి చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
సోమవారం నుండి శుక్రవారం వరకు ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ ను పశ్చిమ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తెలిపారు..బీజేపీ మైనార్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ పటాన్ షమీలా ఖాతూర్, బీజేపీ నాయకులు పగిడిపల్లి రాజేశ్వరి, పోతిన భేసు కంటేశ్వరుడు, యర్రంశెట్టి విశ్వేశ్వరరావు, దేవిన హరి ప్రసాద్,చొక్కర పాపారావు, ప్రముఖ న్యాయవాది రాజశేఖర్ చాట్ల , ప్రసాద్ కొక్కిలి గడ్డ, భానుమూర్తి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు..
