18వ బూత్‌లో ఇంటింటికీ కరపత్రాల పంపిణీ..

రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : ప్రధాన కేంద్రం లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సాయిరాం మ్యాంగో మార్కెట్ అధినేత, టీడీపీ సీనియర్ నాయకులు గోగులమూడి రవీంద్రారెడ్డి నాలుగో రోజు 18వ బూత్ పరిధిలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు కలుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రవీంద్రారెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని గోగులమూడి రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.