తిరుపతమ్మ ఆలయంలో వరుణ జపం, రుద్ర హోమం ప్రారంభం
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గొల్లపూడి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు లోకకల్యాణార్థం వరుణ జపం, రుద్ర హోమం, ఘటాభిషేక కార్యక్రమాలను గురువారం ఘనంగా ప్రారంభించారు.
తొలి రోజు ఉదయం 8.30 గంటలకు మహా గణపతి పూజ, గోపూజ, వరుణ జపం తదితర విశేష పూజలను వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మర్రిబోయిన గోపి, పురోహితులు ఆంజనేయ శర్మ, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
