ఎల్కతుర్తి–దామెర రహదారికి కదలిక
పొన్నం ఆదేశాలతో పరుగులు తీస్తున్న రహదారి పనులు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని ఎల్కతుర్తి–దామెర ప్రధాన రహదారి పనులు కొంతకాలంగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి జిల్లా అధికారులతో పాటు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించి, నిలిచిపోయిన రహదారి పనులను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టారు.
అంతేకాకుండా, పనులు కొనసాగుతున్న సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా రహదారిని చదును చేయించడం, గుంతలను పూడ్చించడం, వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవడం, వర్షపు నీరు రహదారిపై నిల్వ ఉండకుండా అవసరమైన ఏర్పాట్లు చేయించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కల్పించారు.
ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ తక్షణ చర్యలు చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎల్కతుర్తి మండల ప్రజల తరఫున కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, మండల మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొల్లె పోగు రమేష్ బాబు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్ (బక్కి) తదితరులు పాల్గొన్నారు.
