పరకాలలో ఎస్ఐఆర్ ప్రత్యేక కార్యక్రమం..
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని 40వ బూత్ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల తహసీల్దార్ తోట విజయలక్ష్మి హాజరై ఓటర్లకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ అధికారి ఎస్డీ షకీర్, బూత్ లెవెల్ అధికారి అల్లం సాంబయ్య ఓటరు వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా బీజేపీ బీఎల్ఏ ప్రతినిధి, పురపాలక సంఘం 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్ పాల్గొని ఓటర్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, తొలగింపు వంటి ఫారం-6, ఫారం-7, ఫారం-8లను అక్కడికక్కడే స్వీకరించారు.
కొత్తగా 18 ఏళ్లు నిండిన వారు, పేరు మిస్ అయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ తోట విజయలక్ష్మి సూచించారు.
