భూపాలపల్లి జిల్లాలో ఎస్సైల బదిలీలు
భూపాలపల్లి జిల్లాలో ఎస్సైల బదిలీలు
— 15 మంది ఎస్సైలకు స్థానచలనం
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న 15 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను పరిపాలనా కారణాలతో బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్-1 డీఐజీ కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనర్, ఇన్‌చార్జ్ డీఐజీ ఆదేశాలు వెలువరించారు.
ఉత్తర్వుల ప్రకారం డీఎస్‌బీలో పనిచేస్తున్న చి. శ్రీనివాస్‌ను కాటారం ఎస్‌హెచ్‌వోగా, అడవిముత్తారం ఎస్‌హెచ్‌వో పి. మహేందర్ కుమార్‌ను కొయ్యూరు ఎస్‌హెచ్‌వోగా, భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ-2గా ఉన్న జి. రమేష్‌ను అడవిముత్తారం ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు.
పలిమెల ఎస్‌హెచ్‌వోగా టి. సాయి శశాంక్, మహదేవ్‌పూర్ ఎస్‌హెచ్‌వోగా ఎం. సాంబమూర్తి నియమితులయ్యారు. మహదేవ్‌పూర్ ఎస్‌హెచ్‌వోగా ఉన్న కె. పవన్ కుమార్‌ను భూపాలపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ-1గా నియమించారు. కొయ్యూరు ఎస్‌హెచ్‌వో వి. నరేష్‌ను డీఎస్‌బీకి బదిలీ చేయగా, పలువురు ఎస్సైలను డీఎస్‌బీ, డీసీఆర్‌బీ, వివిధ పోలీస్‌స్టేషన్లకు బదిలీ చేస్తూ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు.
