ప్రభుత్వ న్యాయవాదుల గౌరవ వేతనం పెంచాలి..

  • ప్రభుత్వ న్యాయవాదులు మైనార్టీ న్యాయశాఖ మంత్రికి వినతి..

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రభుత్వం న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి గౌరవ వేతనాన్ని పెంచాలని ప్రభుత్వ న్యాయవాదులు గురువారం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను కోరారు.

ఈ సందర్భంగా గవర్నమెంట్ ప్లీడర్ల గౌరవ వేతనాన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రభుత్వ న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలని కోరినట్లు పేర్కొన్నారు. తమ వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించి, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాదులు కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.